
రూ.30,156 కోట్లతో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం
ప్రొద్దుటూరు, అక్టోబర్ 5 (క్విక్ టుడే న్యూస్):
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధితో పాటు రాయలసీమ దశ, దిశ మార్చడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రొద్దుటూరులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి రూ.30,156 కోట్లతో చేపట్టిన ‘అమరజీవి జలధార’ (జల్ జీవన్ మిషన్ 2.0)కు శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 90 లక్షల కుటుంబాలకు ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తామని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డ్రోన్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలుగా ఎదుగుతాయన్నారు. గ్రామీణాభివృద్ధికి పవన్ కల్యాణ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ప్రొద్దుటూరు అభివృద్ధికి డ్రైనేజీ పనులకు రూ.35 కోట్లు, కొర్రపాడు రోడ్డు విస్తరణకు రూ.8 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన చంద్రబాబు, అభివృద్ధికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.





